పారిశ్రామికవేత్తలు పారిపోతారు: చంద్రబాబు

0
470

Times of Nellore (Udayagiri)# కోట సునీల్ కుమార్ #  – కోడికత్తి పార్టీని చూస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఉదయగిరిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్‌ 31 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. తనను నమ్ముకుంటే బంగారు భవిష్యత్‌ ఉంటుందన్నారు. అదే జగన్‌ని నమ్ముకుంటే మీకు జైలు తప్పదని వివరించారు. జైలు కావాలా? బంగారు భవిష్యత్‌ కావాలా? అని అడిగారు. మీ పిల్లల్ని జగన్‌తో పంపిస్తే చిన్నచిన్న నేరాలు చేయించి.. తర్వాత పెద్ద నేరాలు చేయించి జైలుకు పంపుతారని హెచ్చరించారు. వైసీపీ నేత చంపడమా? చావడమా? అంటున్నాడని గుర్తుచేశారు. మేము మిమ్మల్ని చంపం, చంపనీయం.. జైలుకి పంపుతామని వార్నింగ్ ఇచ్చారు.

ఇలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు. ఒక హైదరాబాద్‌ పోతే.. 20 హైదరాబాద్‌లు తయారుచేస్తానన్నారు. కేసీఆర్‌తో కలిసి పనిచేస్తానని జగన్‌ చెబుతున్నాడని, కేసీఆర్‌కి ఊడిగం చేయడానికి జగన్‌ సిద్ధపడ్డాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. సాయంత్రానికి జగన్‌ లోటస్‌పాండ్‌కి వెళ్లాలి.. అక్కడ కేసీఆర్‌కి రిపోర్ట్‌ ఇస్తే.. జగన్‌కు ఆయన డబ్బులిస్తారని చెప్పారు. కేసీఆర్‌ దగ్గర జగన్‌ కూలికి పనిచేస్తున్నాడని విమర్శించారు. జగన్‌, కేసీఆర్‌ ఇద్దరు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాకు అభ్యంతరం లేదని కేసీఆర్‌తో మేనిఫెస్టోలో పెట్టించాలని డిమాండ్ చేశారు. జగన్‌, మోదీ, కేసీఆర్‌ ఎప్పుడూ నిజం చెప్పి ఎరుగరని ఆరోపించారు. జగన్‌ వల్ల ఐఏఎస్‌ అధికారులు జైలుకి వెళ్లారని గుర్తుచేశారు. 9 ఏళ్లు సీఎంగా ఉన్నా తన వల్ల ఏ అధికారి ఇబ్బందిపడలేదన్నారు. నిరుద్యోగ భృతిని రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చారు.ఇంటర్‌పాసైతే కూడా నిరుద్యోగ భృతి వర్తింపజేస్తామన్నారు. ఆడపిల్లలు, యువత భవిష్యత్‌ బాధ్యత తనదేనన్నారు. మోదీ మాటల్లో గారడీ.. పనులు మాత్రం చేతకాదని మండిపడ్డారు.

పండుగ రోజుల్లో రెండు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు ఏపీలో అమలు చేస్తున్నామని తెలిపారు. పెన్షన్లను పది రెట్లు పెంచినట్లు తెలిపారు. మగవారితో సమానంగా మహిళలకు అవకాశాలు రావాలని చెప్పారు. దేశంలో ఎక్కడా డ్వాక్రా సంఘాలు లేవని పేర్కొన్నారు. ఆస్తిలో మహిళలకు ఎన్టీఆర్‌ హక్కు కల్పించారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు కట్టించినట్లు వెల్లడించారు. 29 లక్షల ఇళ్లను ప్రారంభించిస్తే.. 11 లక్షల ఇళ్లకు గృహప్రవేశం చేశామన్నారు. ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నరలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని భరోసా కల్పించారు. చేతకాని వైసీపీ నేతలు మన చెక్కులు చెల్లవంటున్నారని మండిపడ్డారు. అన్నదాత పథకం కోసం రూ.1500 కోట్లు బ్యాంకుల్లో వేసినట్లు స్పష్టంచేశారు.

SHARE

LEAVE A REPLY