మేకపాటికి ఎమ్మెల్యే బొల్లినేని సవాల్..!

0
525

Times of Nellore (Udayagiri) – ఉదయగిరి మాజీ ఎం.ఎల్.ఎ, వైకాపా నాయకులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికు స్ధానిక ఎం.ఎల్.ఎ బొల్లినేని వెంకటరామారావు బహిరంగ సవాల్ విసిరారు. బుధవారం ఆయన జలదంకి మండలం తిమ్మశముద్రం గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి పై మేకపాటితో చర్చకు తాను సిద్ధమన్నారు. కలిగిరి నుండి ఇద్దరం ఒకే కారులో వెళదాం…నియోజకవర్గములోని ప్రతి పంచాయతీకి వెళదాం….అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలను అడుగుదాం అన్నారు. అభివృద్ధి ఎక్కడేక్కడా ఎలా జరిగిందో నీ కళ్ళకు చూపిస్తానని మేకపాటిపై విరుచుకు పడ్డారు. మతిస్థిమితం లేకే పదేపదే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అర్ధరహిత విమర్శలు చేయడం వైకాపాకు అలవాటుగా మారిందన్నారు.చేతనైతే…మేకపాటి చేసిన ఆరోపణలు నిరూపించగలిగితే, అక్టోబరు 6 వ తేదీ, పెద్దపాడు వద్దకు రావాలని, లేని పక్షములో తాను చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని, కేవలం రాజకీయంగా ఎదుర్కొలేకే ఇలా విమర్శలు చేశానని మేకపాటి ఒప్పుకోవాలన్నారు.

SHARE

LEAVE A REPLY