ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేనిపై మళ్లీ అవినీతి ఆరోపణలు

0
803

Times Of Nellore ( Udayagiri ) – నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుపై అవినీతి నిరోదక శాఖ అధికారులు మరో రెండు కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయనపై అధికారులు నాలుగు కేసులు నమోదు చేసి ఉన్నారు.  మరో రెండు కేసులు నమోదు చేయనున్నారు. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు మహారాష్ట్రలో నీటిపారుదల సంస్థలో పలు కాంట్రాక్టులు చేస్తుంటారు.  పనులకు సంబందించి భారీగా కుంభకోణాలు, అవినీతి ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కుంభకోణాలపై మహారాష్ట్ర అవినీతి నిరోదకశాఖ(ఏసీబీ) అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే వెంకటరామారావుపై మరో రెండు కేసులు నమోదు చేసేందుకు రెడీ  అవుతున్నారు. అలాగే బొల్లినేనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు మహారాష్ట్ర ఏసీబీ అధికారులు ప్రయత్నింస్తుంటే, ఆయన మాత్రం అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారనీ. ఇదిలా ఉండగా బొల్లినేని అంశం జిల్లా వ్యాప్తంగా సంచలనం ఉంది.

SHARE

LEAVE A REPLY