ఉచిత కంటి వైద్య శిబిరం@గుణ పాటిపాలెం!

0
94

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ –దానాల్లోకెల్లా నేత్ర దానం గొప్పదని గుణ పాటిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ అడ్వైజరీ కమిటీ సభ్యులు రాజారెడ్డి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రాజేష్ అన్నారు . సోమవారం చిట్టమూరు మండలం గుణ పాటిపాలెం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన ఎం వి రావు పౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ సౌజన్యంతో, నెల్లూరు పట్టణానికి చెందిన మోడరన్ కంటి వైద్యశాల నిపుణులు డాక్టర్ తిలక్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని రాజా రెడ్డి ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరు పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్య సేవలను అందించే క్రమంలో ఈ గ్రామంలో ఎం వి రావు పౌండేషన్ నిర్వాహకులు మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్పొరేట్ వైద్య సేవలను అందుకుని స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు కు నివాళులు అర్పించాలని, వారి తనయుడు చేస్తున్న సేవలను గుర్తించి ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అభినందించాలని కోరారు. అనంతరం డాక్టర్ తిలక్ మరియు డాక్టర్ రజిని రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిలో కంటి శుక్లాలు ఉన్న వారిని గుర్తించి ఆపరేషన్ నిమిత్తం నెల్లూరుకు తరలించారు. ఈశిబిరం లో ఎం.వి.రావు.ఫౌండేషన్ చైర్మెన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ.ఎం. విజయ లక్ష్మీ. ఫార్మసిస్ట్ కృష్ణ వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY