రైల్వే ట్రాక్ పై ఇద్దరు అనుమానాస్పదంగా మృతి

0
239

Times of Nellore ( Manubolu ) – నెల్లూరు జిల్లా మనుబోలు మండలం, కొండూరుసత్రం సమీపంలో రైల్వే ట్రాక్ పై ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో ఒక మహిళ, ఒక పురుషుడు రైలు కిందపడి అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో వీరి శరీర భాగాలు తునా తునకలయ్యాయి. యువకుడి మృతదేహం దూరంగా ఉన్న ముళ్లపొదల్లో పడిపోయి ఉంది. ప్రమాదవశాత్తు ఈ సంఘటన చోటుచేసుకుందో, ఆత్మహత్యకు పాల్పడ్డారో, ఎవరైనా వీరిని చంపి పట్టాలపై వేసి వదిలివెళ్లారో తెలియాల్సివుంది . ఈ స్టేషన్ పరిధిలో ఇదే తరహా సంఘటనలు పలు చోటుచేసుకున్నాయి . వీటిలో కొన్ని ఉద్దేశపూర్వకంగా హత్యచేసి రైలు పట్టాలపై పడవేసి వెళ్లిన సంఘటనలు కూడా నమోదై ఉన్నాయి. దీంతో ఈ మృతులపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైల్వే పోలీసుల విచారణలో నిజ నిజాలు వెల్లడి కావాల్సి ఉంది.

SHARE

LEAVE A REPLY