క్రీడాకారుని అవ‌తార‌మెత్తిన మంత్రి నారాయ‌ణ‌

0
362

TimesOf Nellore (Nellore)-ఎప్పుడూ రాష్ట రాజ‌కీయాల‌తో పాటు జిల్లా రాజ‌కీయాల్లో బిజీగా ఉండే ఆ మంత్రి క్రీడాకారుని అవ‌తార‌మెత్తారు.. కాసేపు ష‌టిల్ బ్యాట్ చేత‌ప‌ట్టారు.. ప్ర‌త్య‌ర్దుల‌కు పోటీనిచ్చారు.. జిల్లా రాజ‌కీయాల్లోనే కాదు… ష‌టిల్ లోనూ త‌న‌కు ఎదురులేద‌ని నిరూపించారు. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.. ఆయ‌నే రాష్ట పుర‌పాల‌క శాఖామంత్రి పొంగూరు నారాయ‌ణ‌.. నెల్లూరు న‌గ‌రంలోని రంగ‌ నాయ‌కుల‌పేటలోని పిఎన్ ఎం స్కూల్ లో ఏర్పాటు ష‌టిల్ టోర్న‌మెంట్ లో ముఖ్య అదిథిగా ఆయ‌న పాల్గొ న్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ శ‌రీరానికి క్రీడ‌లు చాలా అవ‌స‌ర‌మ‌న్నారు.. క్రీడ‌ల ప‌రంగా నెల్లూరు అభివృద్ది చేస్తామ‌న‌న్నారు. న‌గ‌రంలోని ష‌టిల్ అభివృద్దికి రూ.5 కోట్ల‌తో మైదానాన్ని నిర్మించేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆయ‌న అన్నారు. అనంత‌రం పోటీల‌ల్లో గెలుపొందిన విజేత‌ల‌కు ఆయ‌న బ‌హుమ‌తులు అంద‌జేశారు.

విజేత‌లు…

మ‌ధు, జ‌గ‌దీష్‌.. మొదటి బహుమతి 10.116/-
సురేంద్ర‌, తిల‌క్,, రెండో బ‌హుమ‌తి 7,116/-

SHARE

LEAVE A REPLY