అనాథ మృతదేహాం అంత్య‌క్రియ‌ల‌కు ఆర్దిక సాయం

0
544

Times Of Nellore (Venkata Giri)- మాన‌వ‌త్వం, సాయం చేసే గుణం క‌రువ‌వుతున్న నేటి స‌మాజంలో ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకుంటున్నారు వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా. క‌ష్ఠాల్లో ఉన్న‌వారి క‌న్నీరు తుడ‌వ‌డంతో పాటు నేనున్నాను అనే భ‌రోసాను క‌ల్పిస్తున్నారు.. వెంక‌ట‌గిరి ప‌ట్ట‌ణంలో ఇవాళ జ‌రిగిన తాజా ఘ‌ట‌న ఆమెలోని ఔదార్యానికి, మాన‌వ‌త్వానికి అద్దం ప‌డుతోంది..

వెంక‌ట‌గిరి ప‌ట్ట‌ణంలోని గాజులవీధి 23వ వార్డుకు చెందిన కాంత‌మ్మ అనే అనాథ ఇవాళ ఉద‌యం మృతిచెందారు. క‌డుపున పుట్టిన కొడుకు ఉన్నా కూడా నిస్సాయ‌కుడు.. దీంతో విష‌యం తెలుసుకున్న మునిసిప‌ల్ చైర్ప‌ర్స‌న్ దొంతు శార‌దా మృత‌దేహాన్ని సంద‌ర్శించి ఆ అనాథ శవానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు రూ.3000 ఆర్దిక సాయం అంద‌జేశారు.ఈ కార్యక్రమంలో నాయ‌కులు దొంతు గోపి, భవాని శంకర్, సాయితేజ. ఆ ప్రాంత ప్ర‌జ‌లు త‌దిత‌రులున్నారు..

SHARE

LEAVE A REPLY