ప్రజల గురించి ఆలోచించే తీరిక జగన్ కి లేదు….

0
390

Times Of Nellore ( Nellore ) – ఏ కేసు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో  ఆలోచించ‌డం త‌ప్ప ప్ర‌జ‌ల గురించి ఆలోచించే తీరిక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ కు లేద‌ని మంత్రి నారాయ‌ణ విమ‌ర్శించారు.. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా ప్రతి నె‌లా రూ.500 కోట్ల  పింఛన్లు  ఇస్తున్న ఘ‌న‌త చంద్ర‌బాబు నాయుడి ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌న్నారు..  నెల్లూరు నగర కార్పొరేషన్ లోని 52 వ  డివిజన్ లో చేప‌ట్టిన  జన్మభూమి కార్యక్రమంలో  ఆయ‌న పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ప‌క్ష పార్టీపై ఆయ‌న మండిప‌డ్డారు.. టైటానిక్ షిప్ మునిగిపోయిన‌ట్లు వైసీపీ కూడా త్వ‌ర‌లో మునిగిపోతుంద‌ని విమర్శించారు..కోటి తొంబై లక్షల మంది అసంఘటిత కార్మికులకు కేవలం 15 రూపాయలతో 5 లక్షల బీమా కల్పిస్తున్నామ‌ని మంత్రి నారాయ‌ణ అన్నారు.

SHARE

LEAVE A REPLY