విద్యార్ధినిలను లైంగికంగా వేధిస్తున్నడని ప్రొఫెసర్ పై దాడి

0
2272

Times of Nellore ( Nellore ) – నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మరో వివాదం చోటుచేసుకుంది. విధులకు రాని డాక్టర్లు, అదుపు తప్పిన పరిపాలన వీటన్నింటి మధ్య విద్యార్ధుల పట్ల లైంగిక వేధింపుల ఆరోపణ తాజాగా సంచలనం కలిగిస్తోంది. మెడికల్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్ధిని ప్రొఫెసర్ చంద్రశేఖర్ లైంగిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలతో ఆ విద్యార్ధి సమీప బంధువు ప్రొఫెసర్ పై దాడి చేశాడు. మెడికల్ కళాశాలలో హెచ్.వో.డీల సమావేశం జరుగుతున్న సమయంలో మీటింగ్ హాల్లోకి వెళ్ళి ఆ యువకుడు ప్రొఫెసర్ పై చేయి చేసుకున్నాడు. అడ్డం వచ్చిన మరో ఇద్దరు ప్రొఫెసర్లకు కూడా గాయాలయ్యాయి. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

SHARE

LEAVE A REPLY