అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి – మేయరు

0
231

Times of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని గిరిజన గురుకుల బాలికల హాస్టలులోని ఐదవ తరగతి విద్యార్ధినిపై అత్యాచార ఘటనపై విచారణ వేగవంతం చేసి, నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని మేయరు అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలైన చిన్నారిని మేయరు శుక్రవారం పరామర్శించారు. బాలిక తల్లి తండ్రులు, వైద్యులతో మాట్లాడి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పొదలకూరు రోడ్డులోని గురుకుల హాస్టలును మేయరు సందర్శించి విద్యార్ధులూ, ప్రిన్సిపాల్, సిబ్బందితో మాట్లాడి సంఘటన గురించిన నిజానిజాలను విచారించారు. ఈ సందర్భంగా మేయరు మాట్లాడుతూ చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు ఒక పక్క వైద్యులు ధృవీకరిస్తున్నా, సంభందిత గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మాత్రం అలాంటిది జరగలేదనడం దారుణం అని పేర్కొన్నారు. విచారణ జరుగుతున్న తీరూ, అధికారుల వివరణలు దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బాధిత తల్లితండ్రులు ఆరోపిస్తున్నారనీ, ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి విచారణ పారదర్శకంగా జరిగేలా చూస్తానని మేయరు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా, నిందితులకు అదే చివరి రోజవుతుందని గుర్తుంచుకోవాలని మేయరు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వహీదా, రాజా నాయుడు, కొమరగిరి శైలజ, పొత్తూరి శైలజ, ప్రముఖ న్యాయవాది నన్నేసాహేబ్, నాయకులు షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY