శ్రీ విజయ దుర్గా దేవి ఉపపీఠంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సన్నాహాలు

0
457

Times of Nellore ( Gudur ) – గూడూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ విజయ దుర్గా దేవి ఉపపీఠం నందు ఈనెల పదో తేదీ నుండి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నిర్వాహకులు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు గ్రామ దేవత అయిన శ్రీ తాళమ్మ దేవస్థానం నుండి మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా కలిశం ను తీసుకువచ్చారు. అమ్మవారి ఆలయంలో కలిశానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపపీఠం లో భక్తుల సందర్శనార్ధం ఉంచారు. ఈ కలశాన్ని పదో తేదీ ప్రతిష్టించి వివిధ అలంకారాలలో అమ్మవారికి విశేష పూజలు జరిపి ఈ నెల 20వ తేదీన కలశ ఉద్వాసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నవావరణ హోమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY