నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ లో 5 సంవత్సరాల బాలికకు అరుదైన గుండె శస్త్రచికిత్స

0
895

Times of Nellore ( Nellore ) – నెల్లూరు పరిసర జిల్లాలలో మొట్టమొదటిసారిగా కిమ్స్ (బొల్లినేని) హస్పిటల్ లో 5 సంవత్సరాల పిల్లలకు విజయవంతముగా అరుదైన గుండె శస్త్రచికిత్స చేస్తున్నారు. ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలం, పాపినేని పల్లి గ్రామస్థులు దూదేకుల నబీఖాన్ కుమార్తె 5 సంవత్సరాల బిడ్డ వయసుకు తగ్గ ఎదుగుదల లేకపోవడం, ఇతర పిల్లలతో కలసి ఆట, పాటలలో హుషారుగా పాల్గొనలేకపోవడం, మందకొడిగా వుండడం జరుగుతుండేది. పైగా ఏదైన కొంచెం సేపు ఆడినా, తిరిగినా త్వరగా, అలసిపోయి ఆయాస పడేది. అందువలన ఈ అమ్మాయిని తన ఈడు పిల్లలతో పాటు స్కూలుకి పంపడం, పనులు చేయించడం లాంటి వాటి జోలికి పోలేదు. వీలైనంత వరకు ఆ అమ్మాయిని తన పరిధిలో ప్రశాంతంగా ఉండేలాగ ఏ ఒత్తిడి లేకుండా చూసుకుంటుండే వాళ్ళు. స్ధానికముగా కొందరు డాక్టర్లకు చూపించినప్పటికి ఏ పలితం లేకుండా పోయింది.చివరికి కిమ్స్ హాస్పిటల్ కు తీసుకొనివచ్చారు.

కిమ్స్ లో కార్డియాలజీ విభాగ అధిపతి డాక్టర్ సి.యస్. శ్రీనివాసరాజు బిడ్డకు తగ్గు పరీక్షలు నిర్వహించి ఈ బిడ్డ వి.యస్.డి వెంట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అను పుటుకతో వచ్చిన గుండె వ్యాధితో భాదపడుతున్నట్లు, దాని వలన గుండె కొట్టుకుంటున్నప్పుడు రక్తము ఎడమ జఠరికలో నుండి కుడి జఠరికలోనికి రివర్స్ డైరెక్షన్ లో పోవడము వలన బిడ్డ ఈ విధముగా కొద్దిపాటి శ్రమకే ఆయాసపడుతూ ఎదుగదల లేకుండా భాదపడుతున్నట్లు నిర్ధారించారు. డాక్టర్ ఓబులరెడ్డి, ఇతర కార్డియాలజీ అనస్థీిషియా టెక్నీషియన్లు బృందం యొక్క సహాకారాలతో అత్యవసరముగా ఈ డివైస్ను తెప్పించి ఎన్.టి.ఆర్ పథకములో ఫూర్తిగా ఉచితముగా ఈ బిడ్డకు వి.సి.డి క్లోసర్ జయప్రదంగా నిర్వహించారు. ఏ విధమైన ఇబ్బందులు లేకండా బిడ్డ ఆరోగ్యముగా కోలుకుంటున్నది. ఒకటి రెండురోజులలో ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ చేస్తున్నామని చెప్పారు.. ఇంతటి ఆరుదైన అత్యంత క్లిష్టమైన చికిత్సను నెల్లూరి, పరిసర జిల్లాలోనే ప్రప్రధముగా నిర్వహస్తున్నామని తెలిపారు.

SHARE

LEAVE A REPLY