ఈ నెల 8న రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా

0
485

Times of Nellore ( Nellore ) – ఈ నెల 8వ తేదీన ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నామని ఏపి జేఏసి ఛైర్మన్ శేఖర్ రావు తెలిపారు. నెల్లూరు ఏపీ ఎన్.జి.ఓ. భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2004 సంవత్సరం నుంచి సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చిందని, పలురీతిలలో కార్యక్రమాలు చేసిన కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ విధానం మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 8న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, వారిని రెగ్యులర్ చేసిన తరువాత ఆ వ్యవస్థకు స్వస్థిచెప్పి కొత్త ఉద్యోగులను తీసుకోవాలని అన్నారు. వారిని పర్మనెంట్ చేయాలని విన్నవించుకున్నారు. ఈ సీపీఎస్ విధానంలో ఉద్యోగులకు పెన్షన్ అనేది రాలేదని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేనమేషాలు లెక్కిస్తూ, మాకు సంబంధం లేదని అంటున్నారని చెప్పారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపి.ఎన్.జి.ఓ. అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రమణారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెంచరావు, ఉపాధ్యక్షులు పెంచలయ్య, రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల గౌరవ ఆర్గనైజర్ గిరీష్, నెల్లూరు నగర ఎన్.జి.ఓ. ఉపాధ్యక్షులు నాగరాజు, ఇరిగేషన్ డిపార్టుమెంట్ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, వర్క్ చార్జుడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్, ఏపిసిపీఎస్ నగర కార్యదర్శీ మల్లికార్జునరావు, నెల్లూరు నగర ఎన్.జి.ఓ. అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY