గోవా ఖ‌ర్చు ఎవ‌రు పెట్టారో తేల్చాల్సింది పోలీసులే

0
797

Times Of Nellore ( Nellore ) -బెట్టింగ్ కేసుకు సంబంధించి నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు విచారిస్తున్న స‌మ‌యంలో మేయ‌ర్ ఎన్నిక స‌మ‌యంలో గోవా టూర్ ఖ‌ర్చంతా కృష్ణ సింగ్ పెట్టార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ఎమ్మెల్యే మ‌రోసారి స్పందించారు. అజీజ్‌ను మేయ‌ర్ చేసే స‌మ‌యంలో గోవా టూర్ జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని, అయితే దానికి అయిన ఖర్చు అజీజ్ పెట్టార‌ని తాను భావిస్తున్న‌ట్లు రూర‌ల్ ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు. అయితే పోలీసులు కృష్ణ సింగ్ పెట్టిన‌ట్లు త‌మ వ‌ద్ద ప‌క్కా ఆధారాలు ఉన్నాయ‌ని చెబుతున్నారని, దీనిపై పూర్తి విచార‌ణ చేయాల్సిన బాధ్య‌త పోలీసుల‌దేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పోలీసులు దీనిపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తే… గోవా టూర్ ఖ‌ర్చు ఎవ‌రు పెట్టార‌న్న వాస్త‌వం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని అన్నారు

SHARE

LEAVE A REPLY