ఈ నెల 25 నుంచి 28వ తేది వరకు రాష్ట్ర మినీ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ – 2018

0
291

Times of Nellore ( Nellore ) – నెల్లూరు ఏ.సీ. సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 25 నుంచి 28వ తేది వరకు రాష్ట్ర మినీ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ – 2018 నిర్వహించనున్నామని నగర డిప్యూటి మేయర్, బాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాను బ్యాడ్మింటన్ హబ్ గా మార్చే క్రమంలో డి.ఎస్.ఏ., శ్యాప్, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పూర్తి సహాయంతో నెల్లూరు జిల్లాను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ను రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 10 కోట్లతో ఏ.సీ. సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ లో అండర్10, అండర్12, అండర్14.. ఈ మూడు విభాగాలకు సంబంధించి బాయ్స్ అండ్ గర్ల్స్, సింగల్స్ అండ్ డబుల్స్.. పూర్తి స్థాయిలో ఈ నెల 25 నుంచి 28వ తేది వరకు జరుగుతాయని అన్నారు. ఈ నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే క్రీడాకారులందరూ పాల్గొన్నాలని చెప్పారు. రాష్ట్రంలోనే నెల్లూరులో మొట్ట మొదటి సరిగా పిల్లల కోసం ఈ మినీ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పున్నయ్య చౌదరి సూచనలతో, సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ జరుగుతుందని, దాదాపు 800 మంది ఈ మూడు విభాగాలలో పాల్గొంటారని తెలిపారు.

SHARE

LEAVE A REPLY