టిడిపి మినీ మహానాడు కార్యక్రమం

0
174

Times of Nellore ( Nellore ) – నెల్లూరు టిడిపి కార్యాలయంలో టిడిపి నాయకులు మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నుడా ఛైర్మన్ కాటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. యువతకు ప్రోత్సాహం అందించాలని, వారిలో క్రిడా స్పూర్తిని నింపాలని అన్నారు. యువతను ప్రోత్సాహించే విషయంలో తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. క్రిడా ప్రోత్సాహంలో భాగంగా యువతకు క్రికెట్ కిట్స్ ను పంపిణీ చేస్తామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం నిరతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంటుందని తెలిపారు. అనంతరం విజయాడైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నాయకుడు ప్రజల సమస్యలు తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించి, టిడిపి పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. రూరల్ నియోజకర్గంలో ఈ నెల 18వ తేది మైపాడు గేడ్ వద్ద అలాగే 29న జిపిఆర్ కళ్యాణ మండపంలో జరిగే మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చాట్ల నరసింహారావు, అన్నం దయాకర్ గౌడ్, కార్పొరేటర్ రాజా, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY