Times of Nellore ( Gudur ) – నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో ఉన్న టిడిపి పార్టీ కార్యాలయంలో టిడిపి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం హెచ్.డి.పి.టి జిల్లా కోఆర్డినేటర్ కోటా సునీల్ కుమార్ దాతృత్వంతో మూడు ట్రైసైకిళ్లను దివ్యాంగులకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అందజేశారు. అనంతరం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పలు సమస్యలను సమన్వయ కమిటీ సమావేశంలో ప్రతిపాదించిన అంశాలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువెళతామని వెల్లడించారు. గూడూరు పట్టణానికి మంచినీటి సరఫరా పైపులైను గత కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా వేసి పట్టణ ప్రజలకు మంచినీటి సమస్య తీసుకొస్తుందని ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రాబోయే రోజుల్లో సోమశిలకు నీరు తీసుకువచ్చి గూడూరు నియోజకవర్గంలో పంట పొలాలకు నీరు అందించే ప్రయత్నం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్నారని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయ మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ దేవసేనమ్మ, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్, బొమ్మిరెడ్డి పద్మజ, నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.