పోలీసులపై చర్యలు తీసుకోవాలి – దళిత సంఘాలు డిమాండ్

0
134

Times of Nellore ( Gudur ) – నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ ఉండిన లక్ష్మణరావు పై చర్యలు తీసుకోవాలని, దళితులపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట జెఎసి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ కేంద్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు . అనంతరం ధర్నా నిర్వహించారు. కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో ధర్నాను కొనసాగించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాదగిరి మాట్లాడుతూ.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. దళితులపై ఎవరైనా దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా గ్రామంలో రెవెన్యూ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉంది దళితులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జిల్లా పోలీసులు అధికారులు కావాలని భారీగా బలగాలను మోహరించి ఇష్టారాజ్యంగా దళితులపై కేసులు నమోదుచేసి భయభ్రాంతులకు గురిచేశారన్నారు. దళితులకు న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి , రామచంద్రయ్య , తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY