స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా గౌహిత రెడ్డి జన్మదిన వేడుకలు

0
87

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-   నెల్లూరు జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి కుమార్తె గౌహిత రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని దీపం చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. దివ్యాంగుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించాలని భావించి ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఈ సందర్భంగా స్వర్ణ దీపం నిర్వాహకులకు కూరగాయలు, కోడిగుడ్లు , ఎర్రగడ్డల బస్తా ను వితరణ గా అందజేశారు. జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తమ కుమార్తె జన్మదిన వేడుకలను స్వర్ణ ద్వీపం ట్రస్టులో నిర్వహించుకోవడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. పేదలకు, దివ్యాంగులకు తమవంతు చేయూత అందించేందుకు జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు భవిష్యత్తులో కూడా వీటిని మరింతగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY