గోడమీద రాతలతో స్వచ్ఛ నెల్లూరు సాధ్యం కాదు – ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

0
333

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 366 రోజుల ప్రజా ప్రస్థానం ఇంటింటి యాత్రలో భాగంగా నేడు రామలింగాపురంలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్ళి పేరు పేరునా అందరినీ పలకరిస్తూ, స్వయంగా కరపత్రాలను అందిస్తూ, స్థానిక సమస్యలపై ఆరాతీస్తూ అక్కడి నుండే అధికారులకు ఫోన్ చేస్తూ, అనంతరం వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వెయ్యాలని, ప్రజలన్ని అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు నగరంలో కలుషిత నీటి సమస్య ఉందని, నీరు త్రాగేదానికి పనికిరాక త్రాగాల్సిన దుస్థితి. అయితే కనీసం స్నానానికో, ఇంట్లో వాడుకునే దానికి కూడా పనికిరాక ఆ నీళ్ళతో స్నానం చేసి ఈ మధ్య కాలంలో చాలా మంది చర్మవ్యాధుల భారినపడడమే కాకుండా, ఆసుపత్రిపాలయ్యారని అన్నారు. గోడల మీద రాతలతో స్వచ్ఛ నెల్లూరు సాధ్యం కాదని, ప్రజలకు స్వచ్ఛ నీరు అందిస్తే స్వచ్ఛ నెల్లూరు సాధ్యం అవుతుందని అన్నారు. నగర కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న కలుషిత నీటి సమస్యని నగర కమీషనర్ తీవ్రమైన సమస్యగా భావించాలని, పూర్తిస్థాయిలో దాని మీద దృష్టి సారించి, కలుషిత నీళ్ళ బెడద భారి నుండి ప్రజలను కాపాడాలని, అద్వాన్నపు పారిశుధ్యంతో నెల్లూరు నగరంలో ప్రజలు విషజ్వరాలబారిన పడుతున్నారని, పారిశుధ్య సిబ్బందిని పెంచాలని, వారికి అవసరమైన వస్తుసామాగ్రిని అందించాలని కమీషనర్ ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పచ్చా రవి, జల్లి కుమార్, గోపాలయ్య, లీలామోహన్ రెడ్డి, దార్ల సుదాకర్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పచ్చా ప్రవీణ్, పెద్దమహేష్, చిన్న మహేష్, మందల వంశీ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY