విజయవంతంగా క్లిష్టమైన వెన్నుపూస శస్త్రచికిత్సలు

0
274

Times of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని నారాయణ హాస్పిటల్ లో వెన్నుపూసకు సంబంధించిన ఎముకను తొలగించే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశములో న్యూరో సర్జరీ విభాగం వైద్యులు డా. సాయికిరణ్ మాట్లాడుతూ, వెన్నుపూసకు సంబంధించిన క్లిష్టమైన సమస్య వలన నరాల మీద ఒత్తిడి కారణముగా మెడనొప్పి, తిమ్మిర్లు వచ్చినట్లు నిర్ధారించి, నోటి ద్వారా నరం మీద ఒత్తిడికి కారణమైన వెన్నుపూసకు సంబంధించిన ఎముకను తొలగించే శస్త్రచికిత్సను నిర్వహించామన్నారు. గత నెలలో ఇటువంటి సమస్య ఉన్న మరో ముగ్గురికి శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. దీని వెనుక నిష్ణాతులైన అనుభవజ్ఞులైన న్యూరో సర్జరీ వైద్యులు డా.అమిత్ అగర్వాల్, డా. విద్యాసాగర్, డా.వి.ఎ. కిరణ్ కుమార్, న్యూరో అనస్థీషియా వైద్యులు డా.ముషాహిద, డా. అనీల్ ల కృషి ఉందని తెలిపారు. అనంతరం ఇంఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. శ్రీరాంసతీష్, సి.ఈ.ఓ. డా. సతీష్ లు మాట్లాడుతూ, ఎంతో క్లిష్టమైన ఈ శస్త్రచికిత్స డా. యన్.టి.ఆర్. ఆరోగ్య సేవాపథకం ద్వారా పూర్తిగా ఉచితంగా అందించడం జరిగిందని, అధునాతన వైద్యపరిజ్ఞానంను డా. యన్.టి.ఆర్. ఆరోగ్య సేవా పథకంలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యముతో అత్యంత ఖరీదైన ఇంట్రా ఆపరేటివ్ న్యూరోఫిజియాలజికల్ మానిటర్ వంటి అధునిక వైద్య పరికరాలను న్యూరోసర్జరీ విభాగంలో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ సమావేశంలో న్యూరోసర్జరీ బృందం, ఎ.జి.యం. భాస్కర రెడ్డి, మార్కెటింగ్ హెడ్ కె. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY