గిరిజనలు చదువుకొని అభివృద్ధి సాధించాలి – గూడూరు డిఎస్పి రాంబాబు

0
127

 Times of Nellore (GUDUR)# కోట సునీల్ కుమార్‌# : గిరిజనలు చదువుకొని అభివృద్ధి సాధించాలని గూడూరు డిఎస్పి రాంబాబు తెలిపారు . గురువారం గూడూరు మండల పరిధిలోని వెల్లటూరు నెల్లూరు గ్రామ సమీపంలో గిరిజన కాలనీలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యుడు ఆరవ పార్వతయ్య ఆధ్వర్యంలో గూడూరు మండల పరిధిలోని నేలటూరు గిరిజన కాలనీలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు డిఎస్పి రాంబాబు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు . ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా డి ఎస్ పి రాంబాబు మాట్లాడుతూ గిరిజనులు వెనుకబడి ఉండటానికి కారణం చదువుకోకపోవడం అని తెలిపారు . ప్రభుత్వం గిరిజనుల చదువుల కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉందన్నారు . దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు . కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి విజయ మోహన్ రెడ్డి , తాజుద్దీన్ , అరవ పార్వతి , తదితరులు పాల్గొన్నారు . అదేవిధంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ఏబీవీపీ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాలని సూచించారు . కార్యక్రమంలో ఏ పి పి నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు .

SHARE

LEAVE A REPLY