జిల్లాలో పకడ్భందీగా 10వ తరగతి పరీక్షలు – కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు

0
353

Times of Nellore ( Nellore ) – మార్చి 15 నంచి నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్భందీగా నిర్వహిచడం జరుగుతుందని, పరీక్షా సెంటర్లలో మాస్ కాపీయింగ్, ఇతర అవకతవకలు జరిగినట్లయితే నదరు సెంటరు చీఫ్ సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో 2018- 10వ తరగతి పరీక్షల నిర్వహణపై నిర్వహించిన కో-ఆర్డనేషనం కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 31 ఎ కేటగిరి సెంటర్లు, 50 బి కేటగిరి సెంటర్లు, 28 సి కేటగిరి సెంటర్లు వెరసి 169 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందని, అందులో 33 వేల 100 మంది విద్యార్ధులు పరీక్షలు వ్రాయనున్నారని ఆయన తెలిపారు. తెలుగు మీడియం విద్యార్ధులు 11689, ఇంగ్లీషం మీడియం విద్యర్ధులు 21342 మంది ఉన్నారని వివరించారు. పరీక్ష నిర్వహణ సమయంలో 12 ప్లైయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటుచేయడంతోపాటు 7 సమస్కాత్మక ప్రాంతాలలో సైలెట్ ప్రాజెక్ట్ కింద సి.సి. కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలను ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారు శ్యామ్యూల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుబ్రమణ్యం, వెంకటకసుబ్బయ్య, ఆర్. ఐ. ఓ. బాబు జాకబ్, డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ శివరామ్ ప్రసాద్, ఆసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్ అనీల్ కుమార్, ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ అధికారి ప్రశాంతి, వివిధ శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY