జొన్నవాడ కామాక్షమ్మ హుండీ లెక్కింపు ప్రారంభం

0
206

Times of Nellore (Jonnavada) – జొన్నవాడ కామాక్షితాయి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ సంవత్సరం దాతలు, ఆయా శాఖల అధికారుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించామని ఆలయ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు అన్నారు

బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నాడ గ్రామంలో వెలసివున్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ సుబ్రమణ్యం నాయుడు తో సహా ఆలయ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆలయ చైర్మన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆలయ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు హాజరైన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంలో ఆలయ కమిటీ సమిష్టి గా కృషిచేసిందన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన దాతలు,అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాలనుండి సైతం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మ వారి ఆశీస్సులు పొందారని ఆయన పేర్కొన్నారు.ఆలయ కార్యనిర్వాహక అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల నిర్వహణలో సహకరించిన దాతలకు, ఆయా శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ పాలకమండలి సభ్యుడు సింగారెడ్డి లక్ష్మీ నరసారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY