వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలి..

0
1061

TimesOf Nellore (Nellore)- వాల్మీకీ( బోయ)ల‌ను ప్ర‌భుత్వం అడుగ‌డుగునా మోసం చేస్తోందని వాల్మీకి (బోయ‌) సంక్షేమ సంఘం జిల్లా గౌర‌వాధ్య‌క్షులు పిక్కిలి రవీంద్ర బాబు మండిప‌డ్డారు.. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాల్మీకిల‌ను ఎస్టీ జాబితాలోకి చేర్చుతాన‌ని  ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు. నెల్లూరు న‌గ‌రంలోని ప్రెస్ క్ల‌బ్ లో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆ  సంఘం జిల్లా అధ్య‌క్షులు న‌ల్ల‌బోతులు వెంక‌టేశ్వ‌ర్లుతో క‌లిసి మీడియాతో మాట్లాడారు..   వాల్మీకి జాతి ద్వారా వెలుగులోకి వ‌చ్చిన రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు త‌న శాస‌న‌స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వాల్మీకి ఫెడ‌రేష‌న్ ఏర్పాటు చేసి, పాల‌క‌వ‌ర్గాన్ని నియ‌మించి రూ.1000 కోట్ల నిదులు ఏర్పాటు చేయాల‌ని  డిమాండ్ చేశారు… వాల్మీకి స్థితిగ‌తుల‌పై అధ్య‌య‌నం చేసేందుకు ఏర్పాటు చేసిన స‌త్య‌పాల్ కమిటీ ఏమైంద‌ని ప్రశ్నించారు.. రానున్న రోజుల్లో ఎస్టీ రిజ‌ర్వేష‌న్ దిశగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోక‌పోతే వాల్మీకుల ఆగ్ర‌హానికి గురికాక‌త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు…

SHARE

LEAVE A REPLY