కన్నుల పండుగగా శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు!

0
286

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ – మూలాపేటలోని శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి సంప్రదాయంగా అగ్నిగుండ మహోత్సవాన్ని నిర్వహించారు. విశేష అలంకారంలో కొలువుదీరిన శ్రీకృష్ణుడు, ద్రౌపదీ సమేత ధర్మరాజుల సమక్షంలో భక్తులు అగ్నిగుండాన్ని తొక్కారు. తొలుత ప్రధానార్చకుల ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తలపై కలశాన్ని ధరించి అగ్నిప్రవేశానికి శ్రీకారం చుట్టారు. అనంతరం దీక్షలు స్వీకరించిన భక్తులు అగ్నిగుండంలో నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ద్రౌపదీదేవి పవిత్రతకు చిహ్నంగా అమ్మవారు అగ్నిపునీతని చాటుచెబుతూ దేవస్థానంలో అగ్నిప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిప్రవేశం అనంతరం అగ్నిగుండం చుట్టూ అమ్మవారి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు దేవస్థానం ఉభయకర్తగా వ్యవహరించింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను తిలకించారు. భక్తులు వేడుకను తిలకించేందుకు ప్రత్యేకంగా టీవీలను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఈవో వెంకటేశ్వర్లు, ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ శివపురం సురేష్‌, సభ్యుల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం వసంతోత్సవం నిర్వహించనున్నారు.

SHARE

LEAVE A REPLY