స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి !!

0
97

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులను సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుభరోసా పధకం ఎవరికైనా అందకపోయిన పరిశీలించి, అన్ని సమస్యలు పరిష్కరించి అందచేస్తామని తెలిపారు. అర్హత కలిగిన అందరికి ఇళ్ళ స్థలాలు అందచేస్తామని తెలిపారు. కొన్ని చోట్ల ప్రభుత్వం భూములను, మరికొన్ని చోట్ల ప్రైవేటు భూములను గుర్తించాల్సి ఉందన్నారు. వీటిపై స్థానిక నాయకులే నిర్ణయం తీసుకొని, గ్రామస్థులకు అనువుగా ఉన్న స్థలాలను గుర్తించాలన్నారు.

SHARE

LEAVE A REPLY