మోసగాడిని, దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు : పోలీసులకు ఎస్పీ రివార్డులు

0
182

Times of Nellore (Nellore) #కోట సునీల్ కుమార్ # – నెల్లూరు జిల్లాలో వివిధ కేసులను జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి  పోలీస్ కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తోటపల్లిగూడూరు కు చెందిన అశోక్ కుమార్ రెడ్డి కార్లను అద్దెకు తీసుకుని యజమానులకు తెలియకుండా అమ్మేవాడని, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అశోక్ కుమార్ రెడ్డి విక్రయించిన 5 కార్లను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. మరో కేసులో జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న తంబి సురేష్ ను సి సి ఎస్ క్రైమ్ టీం పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్దనుండి 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి, హోండా బైక్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. తంబి సురేష్ 30 దొంగతనం కేసుల్లో ఉన్నాడని,అందులో 8 కేసుల్లో జైలు కు కూడా వెళ్లాడని తెలిపారు.ఈ కేసులను ఛేదించడంలో కీలక పాత్ర వహించిన సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డు లు అందజేశారు.

SHARE

LEAVE A REPLY