పశు సేవా కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సోమిరెడ్డి

0
71

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ #- నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డుకాలనీలో ఉన్న శ్రీ మహావీర్ జైన్ పశుసేవా కేంద్రాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడారు. కల్లూరుపల్లి ప్రాంతంలో పదేళ్లుగా మహావీర్ పశుసేవా కేంద్రాన్ని నిర్వహిస్తుండటం అభినందనీయమని, రోడ్లపై తిరుగుతూ గాయపడిన ఆవులు, కుక్కలను, నోరులేని జంతువులు, పక్షులను సంరక్షిస్తుండటం ప్రశంసనీయమన్నారు. ఈ సేవా కేంద్రంలో 150 ఆవులు, 280 కుక్కలు, 480 పావురాళ్లు, 28 కోళ్లు, 6 గొర్రెలు, 15 కుందేళ్లు ఉండటం తెలిసి ఆశ్చర్యం కలిగించిందన్నారు. .నిర్వాహకుల సేవా తత్ఫరత ఎనలేనిది..వీరికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇలాంటి సేవా సంస్థలకు దాతలు కూడా చేయూత అందించాల్సిన అవసరంఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

SHARE

LEAVE A REPLY