మన కోసం..మన దేశం కోసం త్యాగం చేద్దాం – మాజి మంత్రి సోమిరెడ్డి

0
56

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- మాజి మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా అనే మహమ్మారి విస్తరించకుండా నిరోధించేందుకు మరో మూడు వారాలపాటు యావత్తు దేశం అష్ట దిగ్బంధనం పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు జోడించి మరీ చెప్పారని ఆయన మాటకి మనందరం కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. అయ్యప్పమాల, రంజాన్ ఉపవాసాల తరహాలో ఈ ఉగాదికి 21 రోజుల లాక్ డౌన్ దీక్ష బూనుదాం.మన కోసం..మన దేశం కోసం త్యాగం చేద్దాంమని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ప్రజలందరూ కరోనా దరిచేరనివ్వకుండా తగు జాగ్రత్తలను పాటించాలని ఆయన సూచించారు.

SHARE

LEAVE A REPLY