సింహపురి హాస్పిటల్స్ ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్స్ !!

0
241

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- యూరోప్ కి చెందిన మెడి కవర్ హాస్పిటల్ నెల్లూరు కు చెందిన సింహపురి హాస్పిటల్ లో మెజారిటీ వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. సోమవారం స్థానిక మినర్వా గ్రాండ్ హోటల్ లో జరిగిన విలేఖరుల సమాపశంలో మెడికవర్ ప్రతినిధులు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిందారు. మెడికవర్ ఇండియా చైర్మన్ డా.అనిల్ కృష్ణ మాట్లాడుతూ యూరోప్ కి చెందిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు డయాగ్నోస్టిక్ రంగాల్లో ఖ్యాతినార్జించిన అంతర్జాతీయ హెల్త్ కేర్ గ్రూప్ మెడికవర్ ఆంధ్ర ప్రదేశ్ లో తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా నెల్లూరు కు చెందిన 300 పడకల సామర్థ్యం గల సింహపురి హాస్పిటల్ లో 80శాతానికిపైగా వాటా కొనుగోలు చేసింది. మెడి కవర్ ప్రపంచవ్యాప్తంగా పోలాండ్ ఉక్రెయిన్, రొమేనియా, జర్మనీ లతో సహా 11 దేశాలు తమ ఉనికిని కలిగి ఉండి కొద్ది  సంవత్సరాల క్రితం ఢిల్లీ లో సంతాన సాఫల్య కేంద్రాలు ప్రారంభించడం ద్వారా భారత వైద్యరంగంలో అడుగు పెట్టిందని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో తమ విస్తరణలో భాగంగా ఈ కొనుగోలు చేశామని, అతి త్వరలో ప్రత్యేక కాన్సర్ హాస్పిటల్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది మెడి కవర్ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి కాగలద ని ఆయన తెలిపారు. మెడి కవర్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర లలో 11 హాస్పిటల్ ను కలిగి ఉందన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వైద్య రంగంలో భాగస్వాములవుతూ ఆంధ్ర ప్రదేశ్ లో విస్తరణపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రజలకు చేరు కావడమే లక్ష్యం గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో శ్రీకాకుళం లో ఒక కొత్త హాస్పిటల్ ను ఏర్పాటు చేయనున్నారని, ఆంధ్ర ప్రదేశ్ లో విస్తరణకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థాయి
ప్రమాణాలతో, ప్రజలకు అందుబాటులో దరలలో విద్య అందించే లక్ష్యంతో ముందుకు సాగుతామన్నారు.

సింహపురి హాస్పిటల్ డైరెక్టర్ డా.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ద్వితీయ మరియు తృతీయ శ్రీ ని నగరాలకు చెందిన ప్రజలు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు పొందేందుకు 6 నుండి 8 గంటల పాటు ప్రయాణించి మెట్రో నగరాలు వెళ్ళవలసి రావడం ఎంతో బాధాకరమని, ఇది తమ లక్షానికే విరుద్దమన్నారు. యూరోప్ లో అత్యంత ప్రజాదరణ కలిగిన హెల్త్ కేర్ గ్రూప్ మెడి కవర్ సింహపురి లో 80శాతానికిపైగా పెట్టుబడి పెట్టడం ఎంతో గర్వించదగిన విషయమన్నారు.

SHARE

LEAVE A REPLY