ఫోక్సా యాక్ట్ కేసులో ఇద్దరి అరెస్ట్

0
390

Times of Nellore (Nellore) – బాలికను లైంగికంగా వేధించిన ఘటనలో ఇద్దరు నిందితులను దర్గామిట్ట పోలీసులు శనివారం కొండాయపాళెం గేటు సమీపంలో అరెస్ట్‌ చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. డైకస్‌రోడ్డుకు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో పాటు బంధువుల కుమార్తెను ఈ నెల 13వ తేదీ ఆదివారం గొలగమూడిలోని ఫన్‌ పార్కుకు తీసుకెళ్లారు. తిరిగి స్కూటీపై ఇంటికి బయలుదేరుతూ బంధువుల కుమార్తెను గొలగమూడి నుంచి ఆటోలో ఎక్కించి దంపతులిద్దరూ ఆటోను వెంబడిస్తూ బయలుదేరారు.

అయితే కనుపర్తిపాడు సమీపంలోని మద్యం దుకాణం వద్ద సుందర య్యకాలనీకి చెందిన పోతయ్య,గొలగడమూడి ఆంజనేయపురానికి చెందిన నాగూరు అనే ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి మోటారుసైకిల్‌పై నగరంలోకి వస్తూ ఆటోలో వస్తున్న బాలికతో అసభ్యకరంగా వ్యవహరిస్తూ వెంబడించారు. ఈ విషయాన్ని వెనుక వస్తున్న దంపతులు గమనించి అన్నమయ్య సర్కిల్‌ వద్ద వారిద్దరని పట్టుకుని నిలదీశారు. దీంతో వారు ఆ దంపతులపై ఎదురు తిరిగారు. స్థానికులు అక్కడకు చేరుకుని ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడిన పోతయ్య, నాగూరుకు దేహశుద్ధి చేసి దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. వారిని తప్పించుకుని నిందితులు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్గామిట్ట ఎస్సై రఘునాథ్‌ నిందితులపై ఫోక్సాయాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. శనివారం నిందితులను కొండాయపాళెం గేటు వద్ద ఉండగా అరెస్ట్‌ చేశారు.

SHARE

LEAVE A REPLY