రోటరీ భవన్లో డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ

0
314

Times of Nellore ( Gudur ) – గూడూరు పట్టణంలోని రోటరీ భవన్లో డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చదువుకుంటున్న విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లను సంస్థ నిర్వాహకుడు సురేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ప్రతిఏటా సుమారు 16 లక్షలు ఖర్చుచేసి విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్నామన్నారు. అయితే ఈ సంస్థ ద్వారా చదువుకునే విద్యార్థులు విద్యలో రాణించడం ద్వారా తమకు ఆనందం కలుగుతుంది అన్నారు. ఆనందంతోపాటు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునీ గిరీష్, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY