రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ

0
90

Times of Nellore ( Gudur ) – నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్.ఎం.జి పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మైధిలి హాస్పిటల్ అధినేత రమణబాబు దాతృత్వంతో విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లను అందజేశారు. ఈ సందర్భంగా రమణబాబు మాట్లాడుతూ.. పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు, అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరాలని చూపించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు హరిప్రసాద్, దసరద రామిరెడ్డి, బత్తిన సుధాకర్, రాము, జాన్ ప్రభాకర్ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY