అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి !!

0
117

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ గతంలో ముస్లిం, మైనారిటీలను అన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం తప్ప, అభివృద్ధి, సంక్షేమం చేసింది లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా మహానేత రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా ముస్లిం, మైనారిటీలకు అన్ని విధాలా అండగా నిలబడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు గర్వ పడేలా జగన్మోహన్ రెడ్డి పాలన ఉందన్నారు.

SHARE

LEAVE A REPLY