రత్నం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

0
66

Times of Nellore (నెల్లూరు)# కోట సునీల్ కుమార్ # :   నెల్లూరు హరనాధపురం లోని రత్నం స్కూల్ లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ శాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాలా క్రీడా మైదానంలో అందమైన రంగవల్లులు తీర్చి, సాంప్రదాయ బద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. బాలికలు గొబ్బెమ్మలను ఏర్పరచి ,
విద్యార్థులు హరిదాసుల వేషధారణతో అలరించారు. ఎడ్లబండి, రిక్షా వాహనాలను అలంకరించి ప్రదర్శించారు. గంగిరెద్దు ను ఆడించి చూపరులను ఆనంద పరచారు. పల్లె వాతావరణం ప్రతిబింబించేలా ఇల్లు.పరిసరాలను ఏర్పాటుచేశారు. భోగి ఏర్పటు చేసి పండగ వాతావరణాన్ని తలపించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శాంతి తో పాటు అధ్యాపక సిబ్బంది , విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY