నెల్లూరుజిల్లాలో టపాకాయల విక్రయాలు 20 కోట్లు

0
1615

Times of Nellore ( Nellore ) – వాణిజ్య నగరంగా ఎంతో పేరున్న నెల్లూరులో పండుగల సమయంలో కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రజలు. తాజాగా జరిగిన దీపావళి పండుగకు కేవలం టపాకాయలకు ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్కల్లో తేలింది. వివిధ ప్రదేశాల నుండి నెల్లూరుజిల్లాకు చెందిన వ్యాపారులు, గోడౌన్లలో తయారయ్యే వాటి విలువలను బట్టి అధికారులు ఈ లెక్కను తేల్చారు. గత ఏడాది కూడా 20 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అప్పట్లో అధికారులు అంచనా వేశారు. గతేడాది దీపావళికి వర్షం కురిసినా టపాకాయల వ్యాపారం జోరుగానే జరిగింది. ఈ ఏడాది వర్షం లేదు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది వ్యాపారం మరింత జోరుగా సాగింది.

అయితే 20 కోట్ల రూపాయలు వ్యాపార లావాదేవీలను బట్టే నిర్ధారించారు. మిగిలిన దంతా అనధికారికంగా జరిగిన వ్యాపారమే. అనధికారికంగా సుమారు 5 కోట్ల రూపాయల వరకూ వ్యాపారం జరిగి ఉంటుందని అంచనా వేశారు. నెల్లూరు నగరంలో సుమారు 20 గోడౌన్లు ఉన్నాయి. వారంతా హోల్ సేల్ ధరలకే టపాకాయలను విక్రయిస్తుంటారు. వీరు గాక తమిళనాడు నుండి కేవలం దీపావళి పండుగ నేపద్యంలో సుమారు 200 మంది టపాకాయలను కొనుగోలు చేసుకొని ఇక్కడ విక్రయిస్తుంటారు. అలాగే నెల్లూరులోని పొర్లుకట్ట ప్రాంతంలో 15 బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లాలోని అన్నీ ప్రాంతాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలు, గోడౌన్లు, హోల్ సేల్ విక్రయాలు, మార్కెట్ విక్రయాలు సాగాయి. వీటన్నింటిని లెక్కగట్టిన అధికారులు 20 కోట్ల రూపాయలకు పైగానే టపాకాయల విక్రయాలు సాగినట్లు ప్రాధమికంగా అంచనా వేశారు.

SHARE

LEAVE A REPLY