ప్రజలు నరకం చూస్తున్నారు – ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

0
223

Times of Nellore ( Nellore ) – 366 రోజుల ప్రజా ప్రస్థానంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం 18వ డివిజన్, హరనాధపురంలో పర్యటించారు. స్థానిక ప్రజలను పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. స్థానిక సమస్యలపై అక్కడి నుంచే అధికారులకు ఫోన్ చేస్తూ త్వరతగతిన పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న అడ్డగోలు పనులు వల్ల తాము పడుతున్న ఇబ్బందులను స్థానిక మహిళలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ చేసి వారిని పిలిపించారు. స్థానికుల ఆవేదనను అధికారులకు తెలియజేశారు. 24 గంటల్లో సమస్య పరిష్కారిస్తామని అధికారులు ఇచ్చిన హామితో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంగీకరించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలోని సాగుతున్న భూగర్భ డ్రైనేజ్, మంచినీటి పథకం పనుల్లో పబ్లిక్ హెల్త్ శాఖ, నగర కార్పొరేషన్, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లేక ప్రజలు నరకం చూస్తున్నారని, ఆటోలు, కార్లు, తిరిగే పరిస్థితిలేదని, పాదచారులు, స్కూటర్ దారులు గుంటల్లో పడి కాళ్ళు, చేతుల విరగోట్టుకుంటున్నారని, ప్రజలు ప్రశ్నస్తే జవాబు చేప్పే వాళ్ళు కరవయ్యారని, పబ్లిక్ హెల్త్ నగరకార్పొరేషన్, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపంతోనే ప్రజలకు ఇన్ని అగచాట్లా అని, అందుకు మసన్వయం కోసం ఒక ప్రత్యేక నోటల్ అధికారిని నియమించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ ని కోరారు.

SHARE

LEAVE A REPLY