హౌస్ ఫర్ ఆల్ గృహాలను త్వరలోనే పేద ప్రజలకు అందజేస్తాం -రూప్ కుమార్ యాదవ్!!

0
34

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన హౌస్ ఫర్ ఆల్ గృహాలను త్వరలోనే పేద ప్రజలకు అందజేస్తామని వైసీపీ నేత రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. జనార్దన్ రెడ్డి కాలనీ లో పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని వామపక్షాలు నిర్వహించిన ముట్టడి కార్యక్రమానికి స్పందిస్తూ వైసిపి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఎన్నో సార్లు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వామపక్షాల నాయకులతో కలిసి పలు సమస్యల పై ఉద్యమించారని గుర్తుచేశారు. పేదలకు ఇళ్ల స్థలాలను అందించే కార్యక్రమాన్ని టిడిపి ప్రభుత్వం కోర్టుల ద్వారా అడ్డుకుంటుందన్నారు. హౌస్ ఫర్ ఆల్ పథకం ద్వారా నిర్మించిన గృహాలకు మరమ్మతులు నిర్వహించి లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

SHARE

LEAVE A REPLY