నరకానికి రహదారులుగా రోడ్లు.. ఏం పాపం చేశారని ప్రజలకి శాపం – అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

0
274

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 366 రోజుల ప్రజా ప్రస్థానం ఇంటింటి యాత్రలో భాగంగా నేడు 19వ డివిజన్, సోమశేఖరపురంలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్ళి పేరు పేరునా అందరినీ పలకరిస్తూ, స్వయంగా కరపత్రాలను అందిస్తూ, స్థానిక సమస్యలపై ఆరాతీస్తూ అక్కడి నుండే అధికారులకు ఫోన్ చేస్తూ, అనంతరం వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వెయ్యాలని, ప్రజలన్ని అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు నగరంలో రోడ్లు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. అన్ని రోడ్లు గుంటలు మెట్టలుగా ఉంటే, గోరుచుట్టుపై రోకటి పోటులాగా వాటర్ పైప్ లైన్ వర్క్ కోసం పూర్తిగా రోడ్డు గుంటలు చేసి గాలికి వదిలేశారన్నారు. యాక్సిడెంట్లు బారినపడుతూ, కాళ్ళు, చేతులు విరగొట్టుకుంటున్న సంగతి, మొత్తం మీద ప్రజలు నరకం అనుభవిస్తున్నారని అన్నారు. కనీసం మనుషులు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వలన ఇక్కడి ప్రజలు నానా అవస్థులు పడుతున్నారన్నారు. ఇక్కడి రోడ్లు చూస్తుంటే నరకానికి రహదారులుగా ఉన్నాయన్నారు. ఏం పాపం చేశారని ప్రజలకి ఈ శాపం అని ప్రశ్నించారు. ధ్వంసమైన రోడ్లుతో ప్రజలు నరకం చూస్తుంటే కాంట్రాక్టర్లతో కుమ్మకై చోధ్యం చూస్తున్నారా అంటూ అధికారులను ప్రశ్నించారు. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు అనేక సార్లు తెలియజేసిన ఫలితం రాలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిరసన ధర్నాలు చేస్తే మే లోపు ద్వంసమైన రోడ్లని సరిచేస్తామని బహిరంగా హామీ ఇచ్చారని, ఇప్పటిదాకా అమలు కాలేదని, ఇప్పటికైన సరిచేయకుంటే జరగబోయే పరిణామాలకు అధికారులదే బాధ్యత అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

SHARE

LEAVE A REPLY