జిల్లా కలెక్టరుపై కాకాణి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం – రెవెన్యూ ఉద్యోగుల సంఘం

0
164

Times of Nellore ( Gudur ) – జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు, గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఏ.ఓ కృష్ణారావు డిమాండ్ చేశారు. బుధవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రెవిన్యూ శాఖ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముత్యాల రాజును అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే కాకాణి వెనక్కి తీసుకుని కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణ్ బాబు, తాసీల్ధార్ వరకుమార్, రెవిన్యూ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY