ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులను తగ్గించాలి…

0
402

Times of Nellore ( Nellore ) – ప్రైవేట్‌ పాఠశాలల్లో వసూల్‌ చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జనసేన పార్టీ నాయకులు ఆందోళన చేయడం జరిగింది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు టోనీ మాట్లాడుతూ.. ప్రైవేట్‌ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. దీంతో విద్యార్థి తల్లితండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు వసూల్ చేయాలని అన్నారు. కలెక్టర్ వెంటనే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు రోజులలో ఈ సమస్య పరిష్కారం కాకుండా రిలే నిరహార దీక్షలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY