ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు…

0
530

Times of Nellore ( Gudur ) – రాష్ట్రంలోని వెలుగొండ అడవుల్లో ఉన్న ఎర్రచందనం చెట్లను నరికి విదేశాలకు అమ్ముకునేందుకు ప్రయిత్నిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశామని గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా క్రైమ్ ఓ.ఎస్.డి. విఠలేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్మగ్లర్లలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 75 లక్షల విలువ చేసే 40 ఎర్రచందనం దుంగల్ని, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు డిఎస్పీ రాంబాబు, ఎస్ఐలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY