శవాలను ఖననం చేసే అత్యాధునిక పరికరం – రెడ్ క్రాస్

0
95

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- కరోనా వైరస్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 38000 కేసులు మరియు రోజుకి 1000 పాజిటివ్ కేసులు చొప్పున నమోదవడం వలన అనారోగ్యం ఉన్నవారు ఈ వైరస్ సోకి కొంత మంది మృత్యువాత పడుతున్నారు. అలాంటి వారి మృతదేహాల దహనం చెయ్యడంకోసం మొబైల్ ఎలక్ట్రానిక్ క్రిమేటర్ గ్యాస్ సహాయంతో వారిని ఖననం చేయడం జరుగుతున్నది. ఈ పరికరం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రెడ్ క్రాస్ సంస్థ శవాలను ఖననం చేసే అత్యాధునిక పరికరం నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ ఆవరణంలో జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ అద్యక్షులు శ్రీ K.V.N. చక్రధర్ బాబు, ఐ.ఏ.యస్. చేతుల మీదుగా ప్రారంభించారు. దీని విలువ సుమారు 7 లక్షల రూపాయలు ఉంటుందని రెడ్ క్రాస్ చైర్మన్ పి.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

ఒక డెడ్ బాడీ సుమారు 90 నిమిషాలలో 750 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బూడిద గా మార్చి రెడ్ క్రాస్ వాలంటీర్ల ద్వారా ఆ బూడిదను వారి కుటుంబాలకు అందించేలా ఏర్పాటు చేశారని తెలియజేశారు ఇది పూర్తిగా బోడి గాడి తోట స్మశాన వాటికలో అమర్చబడి ఉంటుందని అని రెడ్ క్రాస్ చైర్మన్ తెలిపారు. అవసరం అయినచో ఇలాంటి మరొక పరికారాన్నిరెడ్ క్రాస్ ఏర్పాటు చేస్తుందని రెడ్ క్రాస్ చైర్మన్ పి.చంద్రశేఖర్ రెడ్డి గారు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే 150 మందిచే ప్లాస్మా దానం చేయించినందుకు మరియు గవర్నమెంట్ ఆసుపత్రి కి అంబులెన్స్ ఉచితంగా అందజేసినందుకు రెడ్ క్రాస్ చైర్మన్ ని మరియు రెడ్ క్రాస్ సభ్యులని అభినందించారు.
ఈ కార్యక్రమానికి వైస్-ఛైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు, ట్రెజరర్ పి. సురేశ్ జైన్, మేనేజింగ్ నేజింగ్ కమిటీ సభ్యులు బయ్యా ప్రసాద్, యడవల్లి సురేశ్, రెడ్ క్రాస్ బ్లడ్ బంక్ కన్వెనర్ సి.హెచ్. అజయ్ బాబు, రెడ్ క్రాస్ వివిధ విభాగాల కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.

ఈ 15 నెలల్లో మీరు సాధించిందేంటి?:

SHARE

LEAVE A REPLY