డోర్ డెలివరీకై ఆన్లైన్ సంస్థలకు అనుమతులు – ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్

0
87

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కమిషనర్ పివివిస్ మూర్తి ఒక వినూత్న పద్దతిని తీసుకువచ్చారని ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ అన్నారు. ఈ సందర్భంగా అయన మీడియా తో మాట్లాడుతూ ప్రధాన షాపింగ్ మాల్స్ కు ఫోన్ కాల్ చేస్తే ఇంటికే సరుకులను సరఫరా చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. అదేవిధంగా స్విగ్గి, జొమాటో ఫోన్ అప్లికేషన్ ల ద్వారా నిర్ణీత ఆహార పదార్ధాలను నేరుగా వినియోగదారుని ఇంటికే సరఫరా చేసేలా ఆయా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశామని కమిషనర్ తెలిపారు.కరోనా వైరస్ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడానికి ప్రజలంతా 21 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంటూ కచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.

SHARE

LEAVE A REPLY