అపోలో హాస్పిటల్ లో అరుదైన కిడ్ని మార్పిడి ఆపరేషన్

0
252

Times of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో మరో అరుదైన ఆపరేషన్ ను ఫిబ్రవరి 17వ తేదీన విజయవంతంగా పూర్తి చేసింది. అరుదైన కిడ్ని మార్పిడి ఆపరేషన్ ను అపోలో వైద్యులు జయప్రదం చేసి తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా చేయని, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ( ఒకే బ్లడ్ గ్రూప్ కి చెందని కిడ్నీలను మార్పిడి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన రోగికి, బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తి కిడ్నిని అమర్చడం జరిగింది. ఈ తరహా కిడ్ని మార్పిడి ఆపరేషన్ రాష్ట్రంలోనే 5వదని డా. ఎమ్.వి సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఆపరేషన్ లో నెఫ్రాలజీ విభాగం డా. ఎమ్.వి సురేష్ కుమార్ రెడ్డి బృందాన్ని అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ నవీన్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. స్వేతాలు అభినందించారు.

SHARE

LEAVE A REPLY