6 వ డివిజన్ లో నారాయణ సతీమణి ప్రచారం

0
132

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ #- నెల్లూరు నగరంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి రమాదేవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగర కార్పొరేషన్ పరిధిలో ని 6 వ డివిజన్ లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి నారాయణ సతీమణి తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మంత్రి నారాయణ ఇప్పటివరకు నెల్లూరు నగరంలో 5200 కోట్లకు పైగా నిధులు తెచ్చి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాన్ని అందజేసి నారాయణ కు ఓటు వేయాలని కోరారు. నారాయణ మంత్రి పదవి చేపట్టాక నెల్లూరు నగరం లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని , ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని అన్నారు.

SHARE

LEAVE A REPLY