కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా రక్షాబంధన్!

0
83

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ –కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా రక్షాబంధన్ ఉంటుందని ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయమునకు చెందిన బికె రాజ్యలక్ష్మి అన్నారు.సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జర్నలిస్ట్స్ లకు రాఖీలు కట్టి ప్రేమ కరుణ సహన సీలతకు రాఖీలు నిదర్శనమన్నారు.శాంతి పవిత్రత అహింస నిజాయితి నమ్రతతో జీవించాలని కోరారు.తమ సంస్థ 120 దేశాలలో మానసిక ఒత్తిడి నివారించేందుకు యోగాతో పాటు ప్రజలకు విద్యా వైద్యం అందిస్తున్నామన్నారు.APUWJ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ బ్రహ్మకుమారీలు ప్రతి సంవత్సరం రాకీలు కడుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసారు.బాహ్య సౌందర్యం కంటే అంతరంగిక సౌదర్యం గొప్పదని విద్యార్థులలో దేశ భక్తి నైతిక విలువలు పెంచేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బికె స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY