పుల్వామా ఘటన లో అమరులైన సైనికులకు ఘన నివాళులు !!

0
62

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద పుల్వామా ఘటన లో అమరులైన సైనికులకు నివాళులు నివాళులర్పించి మౌనం పాటించడం జరిగింది . ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోటా సునీల్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం పుల్వామా ఘటన జరగడం చాలా బాధాకరమని ఆ ఘటనలో అమరులైన వీర సైనికులకు జోహార్లు అర్పిస్తున్నమని దేశం కోసం నిస్వార్ధమైన సేవ చేసేవాళ్ళు సైనికులు మాత్రమేనని ప్రేమికుల రోజును బహిష్కరించి అమరవీరులకు జై కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించిన ఏబీవీపీ గురు శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మరియు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం కుటుంబాలను వదులుకొని నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన అమర వీరుల సైనికులకి నివాళులర్పించడం జరిగిందన్నారు. దేశ రక్షణ కోసం అనునిత్యం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశ సేవ చేస్తున్నా సైనికులకు పాదాభివందనం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కార్తీక్ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చిన్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హర్షవర్ధన్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జార్జ్ నగర కార్యదర్శి శ్యామ్, కిరణ్, మహేష్, ప్రసాద్ విద్యార్థులు ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY