దేశం లో తొలిసారి పెన్షన్ లు సాధించిన యోధుడు పుచ్చలపల్లి – సి ఐ టి యూ ఖాదర్ బాషా

0
157

Times of Nellore (Nellore)  #కోట సునీల్ కుమార్ # – నెల్లూరు జండా వీధి సెంటర్ లో సీపీఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ పుచ్చలపల్లి సుందరయ్య, సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తామంటూ నినదించారు. ఈ సందర్బంగా నెల్లూరు నగర సీపీఎం కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ… కామ్రేడ్ సుందరయ్య వర్ధంతి సందర్బంగా నెల్లూరు నగరం లో పలు ప్రాంతాల్లో మజ్జిగ చలివేంద్రాలు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుందరయ్య చిన్న వయసులోనే జాతీయోద్యమంలో పాల్గొన్నారన్నారు, నెల్లూరు జిల్లా అలాగని పాడు వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటుచేశారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి, పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. మహిళా నాయకురాలు మస్తాన్ బీ మాట్లాడుతూ, అలగానిపాడు లోని భూస్వామ్య కుటుంబంలో జన్మించిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 14 వ ఏటనే కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడై అణగారిన వర్గాలు, పేదప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డారన్నారు.

సి ఐ టి యూ నాయకులూ ఖాదర్ బాషా మాట్లాడుతూ, కామ్రేడ్ సుందరయ్య తన జీవితం మొత్తం కార్మిక వర్గ ప్రయోజనాలకై, కార్మిక రాజ్యం స్థాపించాలనే ఆశయం తో పోరాటం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి, నిజం కు వ్యతిరేకంగా పోరాడారన్నారు. దేశవ్యాప్తంగా సుందరయ్య ను ఆదర్శంగా తీసుకుని కమ్యూనిస్టులు పోరాటం చేశారన్నారు. ప్రతి రైతు , ప్రతి కార్మికుడు, పేదవాడు పెన్షన్ తీసుకోవాలని నెహ్రు ప్రభుత్వం తో పోరాడి సాధించిన యోధుడు కామెడీ పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో షబ్బీర్, అమీర్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు సాయంత్రం శీతలపానీయాల అందజేస్తారు.

SHARE

LEAVE A REPLY